Superbook App Icon
Superbook App
Open in the Superbook app
Skip to main content
అన్ని ఎపిసోడ్‌లు

చివరి రాత్రి భోజనం

సూపర్‌బుక్ Episode 110
వరల్డ్స్ బెస్ట్ బ్యాండ్ అని పిలువబడే అమెరికన్ ఐడల్ లాంటి షో కోసం అతని బ్యాండ్ ఆడిషన్‌కు ఆహ్వానించబడినందున క్రిస్ చాలా అతిశయపడుతుంటాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి, సూపర్‌బుక్ పిల్లలను యెరూషలేముకు పంపుతాడు మరియు యేసు ప్రసిద్ధుడైనప్పటికీ, అతను వినయంగా ఇతరులకు సేవ చేసాడని క్రిస్ యేసునుండి నేర్చుకుంటాడు. ప్రభురాత్రి భోజన సమయంలో, చివరికి అందరూ ఇంటికి తిరిగి వస్తారు మరియు క్రిస్ ఇతరుల పట్ల తన వైఖరిలో పెద్ద మార్పును కనుగొంటాడు.

సంబంధిత ప్రశ్నలు మరియు సమాధానాలు

వినయం గురించి బైబిల్ ఏమి చెబుతోంది?

కొన్నిసార్లు, ప్రత్యేకించి మీరు మంచిగా చేసే పనులను బట్టి ప్రజలు ప్రశంసించినప్పుడు గర్వపడకుండా ఉండటం చాలా కష్టం. 1 పేతురు 3:8లో, పేతురు "వినయ వైఖరిని కలిగి ఉండమని" క్రైస్తవులందరినీ ప్రోత్సహిస్తున్నాడు. వినయం అనేది దేవుణ్ణి సంతోషపెట్టే లక్షణం లేదా విలువ. ఆయన గర్విష్ఠులను అసహ్యించుకుంటాడు (సామెతలు 16:5). లూకా 18:14లో తమను తాము తగ్గించుకునే వారు హెచ్చించబడతారని యేసు చెప్పాడు. రోమా. 12:3లో, "మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు." అని మీరు ప్రోత్సహించబడ్డారు. ఇతరుల కంటే మీరు మంచివారని నిరూపించుకోవడానికి లేదా ప్రదర్శించడానికి ప్రయత్నించవద్దు.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

సంఘంలోనూ, దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రవర్తించాలి?

క్రైస్తవులుగా మనం మాట్లాడే తీరును బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవునిని ఘనపరచగలం, గౌరవించగలం. ఆరాధన స్థలంలో (చర్చి వంటివి), చర్చి భవనాన్ని 'దేవుని మందిరం'గా పరిగణించడం ద్వారా మనం దేవుని పట్ల గౌరవాన్ని చూపించగలం. దేవుడు ఆత్మస్వరూపిగా అక్కడ ఉన్నాడు, కనుక మనం ఆయన సన్నిధిలో గౌరవప్రదంగా ప్రవర్తించాలి. బైబిల్లో మోషే (నిర్గమకాండము 3), పౌలు (అపొ. కా 9:3-8, మరియు పెంతెకొస్తు దినాన 5,000 మంది (అపొ. కా. 2) దేవుని సన్నిధిని అనుభవించారు.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

మనం మన శ్రేష్ఠతను దేవునికి ఇవ్వాలా?

పాపంలో పట్టబడిన ఒక స్త్రీ, తన సమాధికి ముందు యేసును 'అభిషేకించడానికి' ఖరీదైన పరిమళ ద్రవ్యాల కూజాను ఉపయోగించింది (లూకా 7:44-48). కొంతమంది శిష్యులు ఆ ధనం వృధా అని భావించారు, కానీ ఆమె యేసుకు విలువైన బహుమతిని ఇచ్చింది. దేవునికి మన శ్రేష్ఠతను ఇవ్వడం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. మీరు చేసే ప్రతి పనిలో ఆయనను గౌరవించండి మరియు ఆయనకు మొదటి స్థానం ఇవ్వండి (సామెతలు 3:9)

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

ఇతరులకు సేవ చేయడం గురించి యేసు జీవితం మరియు మాటలు మనకు ఏమి చెబుతున్నాయి?

యేసు సేవకునిగా పనిచేసి, శిష్యుల పాదాలు కడిగినప్పుడు, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడంలో ఆయన మనకు ఉదాహరణగా నిలిచాడు. ఎల్లప్పుడూ 'ఉన్నతమైన వ్యక్తిగా' ఉండటానికి ప్రయత్నించే బదులు, మనం భిన్నంగా ప్రవర్తించాలని యేసు కోరుకుంటున్నాడు. ఆయన “మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి (లూకా 22:26) అని బోధించాడు. ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞలలో "నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యండి" అనేది ఒకటి (యోహాను 13:15). సేవచేయడానికి త్యాగం తరచుగా అవసరమౌతుంది. యేసు మన కొరకు సిలువపై మరణించినప్పుడు అంతిమ త్యాగాన్ని చెల్లించాడు. మత్తయి 20:28లో యేసు, “మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

క్రైస్తవులు రొట్టె, ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటారు?

మనుష్యులు తరచుగా కొన్నింటిని మర్చిపోతారు. వారు ఒకరికొకరు చేసుకున్న మంచి పనులను మరచిపోతారు - మరియు వారు కొన్నిసార్లు దేవుడు వారికి చేసిన మంచి పనులను కూడా మరచిపోతారు. రొట్టె మరియు ద్రాక్షారసాన్ని ఉపయోగించడం ద్వారా, తన ప్రాయశ్చిత్త మరణాన్నిగురించి యేసు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవ సంఘ ఆరాధనా సమయంలో “జ్ఞాపకార్థంగా” దీనిని చేయండి అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు విధేయతగా దీనిని చేస్తారు (1 కొరింథీయులు 11:24-25). దేవుని ప్రేమను మరియు యేసు త్యాగాన్ని మీకు వీలైనంత తరచుగా జ్ఞాపకం చేసుకోండి. యోహాను 3:16ని కంఠస్థం చేసి, జ్ఞాపకం ఉంచుకోండి - "“దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు."

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి
Professor Quantum looking into camera
Professor Quantum’s Q&A

Superbook Kids Bible App

Image
Superbook Bible App Home Screen
  • Easy to understand Bible
  • Play more than 20 fun games
  • Watch full-length, free Superbook episodes

Discover more about the app and the impact of Superbook!

Icon
Superbook Kids Bible App

Download the Superbook Bible App!

Bring the Bible to life for the entire family with an easy to understand Bible, videos and fun engaging Bible games