Superbook App Icon
Superbook App
Open in the Superbook app
Skip to main content
అన్ని ఎపిసోడ్‌లు

నా ప్రజల్నివెళ్లనివ్వు!

సూపర్‌బుక్ Episode 104
క్రిస్ మరియు ఇతరులు తమకు ఇష్టమైన సూపర్‌బుక్ సాహస యాత్రలను గురించి మాట్లాడినప్పుడు, ఏ సాహసం ఉత్తమమో నిర్ణయించుకోవడం వారికి చాలా కష్టంగా ఉంటుంది. అకస్మాత్తుగా, సూపర్‌బుక్ జీవితకాల సాహసయాత్రకు వారిని తీసుకొనివెళతాడు. మోషే ఐగుప్తు నుండి ప్రజలను బయటకు నడిపించడాన్ని వారు వ్యక్తిగతంగా అనుభవిస్తారు!

సంబంధిత ప్రశ్నలు మరియు సమాధానాలు

దేవుడు మనల్ని వాడుకోగలడని మోషే జీవితం మనకు ఎలా చూపిస్తుంది?

ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు మోషే తప్పు చేసాడు మరియు ఎన్నో సాకులు చెప్పాడు. కానీ ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించే పని కోసం దేవుడు అతన్ని సిద్ధం చేశాడు. ఐగుప్తు యువరాజుగా, అతను అనేక నాయకత్వ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. అతను మిద్యానుకు పారిపోయినప్పుడు, ఆ దేశం గురించి తెలుసుకోవడానికి సంవత్సరాలు గడిపాడు. చివరికి అతను ఈ దేశం గుండా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోగలడు మీరు దేవుని కోసం ఏదైనా చేయవలసి ఉన్నట్లయితే, అది ఎంత చిన్నదైనా, సాకులు చెప్పకండి. దానికి బదులుగా, ఆ పనిని పూర్తి చేయడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడని నమ్మండి. ఉదాహరణకు, మీరు పాఠశాలలో ఒంటరిగా ఉన్న వ్యక్తితో మాట్లాడాలని దేవుడు చెబుతున్నట్లు మీకు అనిపిస్తే, మీరు సిగ్గుపడుతున్నారని లేదా ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలియదని సాకుగా చెప్పకండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. (నిర్గమకాండము 4:12).

మీ పట్ల దేవుని ప్రణాళికలను నమ్మండి

దేవుడు, మోషే, అహరోనులను బృందంగా పనిచేయమని ఎందుకు చెప్పాడు?

చాలా మంది వ్యక్తులు స్వతంత్రంగా ఉండటానికి, ఒంటరిగా పని చేయడానికి ఇష్టపడతారు. బృందంగా పనిచేయడానికి వినయం, సహనం మరియు ఓపిక అవసరం. బృందంలో భాగంగా మీరు ఇతరులతో కలిసి పని చేయడం నేర్చుకుంటారు. (1 కొరింథీ. 12:27). మోషే, అహరోనులు ఒకరితో ఒకరు పంచుకోవడం, కలిసి పనిచేయడం ద్వారా, ఎంతో సాధించగలిగారు. (రోమా. 12:4-5). దేవుణ్ణి మీ బృంద నాయకునిగా చేయాలని గుర్తుంచుకోండి.

మీ కోసం దేవుని ప్రణాళికలను నమ్మండి

ఫరో మొండితనం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

దేవుడు మోషే, అహరోనుల ద్వారా ఫరోతో మాట్లాడాడు, కాని ఫరో వినడానికి నిరాకరించాడు. ఇది ఫరో బాధపడేటట్లు చేసింది. ఇశ్రాయేలీయులు తమను ఐగుప్తు నుండి విడిపిస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని విన్నారు (నిర్గమకాండము 6: 6-8) మరియు ఆయన నెరవేర్చాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు హెచ్చరికనూ, వాగ్దానాన్ని రెండింటినీ ఇచ్చాడు: ““మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”” (నిర్గమకాండము 15:26). దేవుడు తాను చెప్పింది చేస్తాడని మీరు నమ్మవచ్చు. బైబిల్‌లో ఉన్న దేవుని వాగ్దానాలను, హెచ్చరికలను అన్నింటినీ మీరు విశ్వసించవచ్చు. దేవుడు మాట్లాడినప్పుడు, శ్రద్ధగా వినండి.

మీ కోసం దేవుని ప్రణాళికలను విశ్వసించండి

ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన సూచనలు మనకు ఏమి నేర్పించాయి?

సరైనది చేయాలని దేవుని సూచనలు మనకు బోధిస్తాయి. బైబిల్లో, మీ సరైన జీవితం కోసం దేవుడు హెచ్చరికలను, సూచనలను ఇచ్చాడు (2 తిమోతి 3:16). ఉదాహరణకు, విగ్రహాలను ఆరాధించడం (నిర్గమకాండము 20:3-5), కొండేలు చెప్పడం (సామెతలు 20:19), బూతులు మాట్లాడడం (ఎఫెసీయులు 4:29) మరియు అబద్ధాలు చెప్పడం (సామెతలు 6:16-19) గురించి దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించాలని (మత్తయి 22:37), ఇతరుల పట్ల దయచూపాలని, క్షమించాలని (ఎఫెసీయులకు 4:32) మరియు మీ వలె మీ పొరుగువారిని ప్రేమించమని ఆయన మీకు ఆదేశిస్తున్నాడు (మత్తయి 22:38). దేవుని సూచనలను అనుసరించడం కూడా ఆయన పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంది (యోహాను 14:23). అన్నిటికంటే ముఖ్యంగా, ఆయనను అనుసరించడంలో మీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు మరియు ప్రతిరోజూ మీకు సహాయం చేయగలడు (యోహాను:14:16, యెహెజ్కేలు:36:26-27, ఫిలిప్పీ. :2:13).

మీ జీవితం కోసం దేవుని వాక్యాన్ని వినండి

ఎర్ర సముద్రం వద్ద మోషే ఎదుర్కొన్నటువంటి అసాధ్యమైన పరిస్థితులను మనం ఎలా ఎదుర్కోగలం?

అసాధ్యమని అనిపించినా దేవుణ్ణి నమ్మండి. ఇశ్రాయేలీయులు అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నారు. వారు ఎర్ర సముద్రానికి, ఐగుప్తు సైనికులకు మధ్య పట్టుబడ్డారు. అయితే, దేవుడు అసాధ్యమైన కార్యాలు చేసేవాడు. ఆయన తన ప్రజలను రక్షిస్తాడు. (నిర్గమకాండము 15:2). మీరు భయానికి బదులుగా విశ్వాసం కలిగి ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఎంత కష్టమైనా లేదా అసాధ్యమైనవిగా కనిపించినా, అలాంటి ప్రతి పరిస్థితిలో మీకు సహాయం చేస్తాడని దేవుణ్ణి నమ్మండి.

మీ కోసం దేవుని ప్రణాళికలను విశ్వసించండి
Professor Quantum looking into camera
Professor Quantum’s Q&A

Superbook Kids Bible App

Image
Superbook Bible App Home Screen
  • Easy to understand Bible
  • Play more than 20 fun games
  • Watch full-length, free Superbook episodes

Discover more about the app and the impact of Superbook!

Icon
Superbook Kids Bible App

Download the Superbook Bible App!

Bring the Bible to life for the entire family with an easy to understand Bible, videos and fun engaging Bible games