Superbook App Icon
Superbook App
Open in the Superbook app
Skip to main content
అన్ని ఎపిసోడ్‌లు

మొదటి క్రిస్మస్

సూపర్‌బుక్ Episode 108
క్వాంటం గృహంలో వాణిజ్యపరమైన క్రిస్మస్ సందడి గొప్పగా ఉంటుంది కుటుంబ జనన దృశ్యం రెయిన్ డీర్ లేదా శాంటాక్లాజ్ వంటి మరొక అలంకారమే అని క్రిస్ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించిన తర్వాత, క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని కనుగొనే ప్రయాణంలో సూపర్‌బుక్ మన హీరోలను తీసుకువెళతాడు!

సంబంధిత ప్రశ్నలు మరియు సమాధానాలు

దేవునికి మన భవిష్యత్తు తెలుసుననే విషయాన్ని మరియ జీవితం నుండి మనం ఎలా చూడవచ్చు?

మరియకి దేవుడు ఇచ్చిన సందేశంలో కొన్ని అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి, అవి భవిష్యత్తు గురించి దేవునికి ఉన్న జ్ఞానాన్ని వెల్లడి చేశాయి. ఆమె కుమారుడైన యేసు గొప్పవాడవుతాడని, సర్వోన్నతుని కుమారుడు అని పిలుస్తారని మరియు యేసు శాశ్వతంగా పరిపాలిస్తాడనే వాగ్ధానాల వంటివి. అలాగే, ఆయన రాజ్యం ఎప్పటికీ అంతం కాదని, ఆయన దేవుని కుమారుడు అని పిలువబడతాడని కూడా చెప్పబడింది. దేవునికి భవిష్యత్తు తెలుసు కాబట్టి, మీరు మీ భవిష్యత్తు విషయంలో ఆయనను నమ్మవచ్చు.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

దేవుడు స్పష్టమైన సూచనలు ఇస్తున్నాడని యోసేపు జీవితం ఎలా చూపిస్తుంది?

మరియ గర్భవతి అని యోసేపు కనుగొన్నప్పుడు, తాను ఉత్తమమని భావించింది చేయాలనుకున్నాడు - వారి ప్రధానాన్ని నిశ్శబ్దంగా విరమించుకున్నాడు. కానీ దేవుడు ఒక కలలో అతనితో మాట్లాడి అనుసరించడానికి అతనికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. యోసేపు వంటి ఒక 'మంచి' వ్యక్తి, గర్భవతియైన అమ్మాయిని వివాహం చేసుకోవడం, అతని పేరును బట్టి తన కొడుకుకు పేరు పెట్టడమనేది ("జో జూనియర్" అని పేరు లాగా, ఇదికాస్త ఆకర్షణీయంగా ఉంటుంది), యూదుల ఆచారాలకు విరుద్ధంగా ఉంటుంది. అయితే, యెషయా 7:14లోని ప్రవచనం నెరవేరాలి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. చూడండి! కన్య గర్భం ధరిస్తుంది! కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది (దీనికి 'దేవుడు మనతో ఉన్నాడు' అని అర్థం). దేవుడు తనకు కలలో చెప్పినట్లు యోసేపు చేసాడు మరియు యోసేపు దేవునికి విధేయత చూపడం వల్ల ప్రపంచం కొంతవరకు తమ రక్షకుడిని పొందింది. దేవుడు మీకు సూచనలు ఇచ్చినప్పుడు (ఆయన వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా లేదా కలలో కూడా), ఆయనకు విధేయత చూపడం ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గమని మీరు విశ్వసించవచ్చు.

మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకోగలరో తెలుసుకోండి

యేసు చిన్నతనంలో ఎప్పుడైనా చెడు చేశాడా?

యేసు మానవ రూపంలో ఉన్న దేవుడు, కాబట్టి ఆయన పూర్తిగా పాపరహిత జీవితాన్ని గడిపాడని మనకు తెలుసు. కాబట్టి ఆయన తన చిన్నతనంలో ఏ పాపం చేయలేదని మనకు తెలుసు. అందరి చిన్నపిల్లల మాదిరిగానే ఆయన పొరపాటున పాలు పారపోసి ఉండవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ పాపం చేయలేదు.

యేసు మీ కోసం ఏమి చేసాడో కనుగొనండి

యేసు జననంతో ఏ ప్రవచనం నెరవేరింది?

యేసు జననం గురించి మత్తయి 2:5-6లో ప్రస్తావించిన ప్రవచనం పాత నిబంధనలోని మీకా 5:2 నుండి వచ్చింది. అందుకు వారు, “యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు. అయితే, యేసు దానికంటే మించినవాడు - ఆయన రాజుల రాజు (ప్రకటన 19:16) అతని రాజ్యం అంతం కాదు (లూకా 1:33). ఆయనను ఆరాధించండి!

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

కాపరులకు తెలియజేసిన శుభవార్త ఏమిటి?

యేసు జనన వార్త ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించే శుభవార్త అని దేవదూత గొర్రెల కాపరులకు చెప్పాడు. గొర్రెల కాపరులు సత్యాన్ని చూసినప్పుడు, వెంటనే దేవుణ్ణి స్తుతించారు మరియు ఇతరులకు చెప్పడానికి వెళ్లారు. మనం కూడా, “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు.” అని చెప్పాలి (యోహాను 3:16) ఇది మీకూ, ప్రజలందరికీ శుభవార్త. దీనిని బట్టి దేవుణ్ణి స్తుతించండి!

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి
Professor Quantum looking into camera
Professor Quantum’s Q&A

Superbook Kids Bible App

Image
Superbook Bible App Home Screen
  • Easy to understand Bible
  • Play more than 20 fun games
  • Watch full-length, free Superbook episodes

Discover more about the app and the impact of Superbook!

Icon
Superbook Kids Bible App

Download the Superbook Bible App!

Bring the Bible to life for the entire family with an easy to understand Bible, videos and fun engaging Bible games