Superbook App Icon
Superbook App
Open in the Superbook app
Skip to main content
అన్ని ఎపిసోడ్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు

సూపర్‌బుక్ Episode 109
అద్భుతాలు చేసే మాంత్రికుడైన మిరాకులో అనే వ్యక్తికి నిజమైన శక్తులు ఉన్నాయని క్రిస్ నమ్మడం ప్రారంభించినప్పుడు, సూపర్‌బుక్ పిల్లలను చారిత్రాత్మక గలిలయ ప్రాంతానికి తీసుకొనివెళతాడు, అక్కడ యేసు ఒక వికలాంగుడిని నయం చేయడం, సముద్రం మీద తుఫానును శాంతింపజేయడం మరియు ఒక వ్యక్తి నుండి దయ్యాలను బయటికి వెళ్లగొట్టడం నిజమైన అద్భుతాలు చేస్తుంటాడు. అద్భుతమైన వారి సాహసయాత్రలో, అద్భుతాలు చేసే శక్తి దేవుని నుండి మాత్రమే వచ్చిందని క్రిస్ అర్థం చేసుకుంటాడు.

సంబంధిత ప్రశ్నలు మరియు సమాధానాలు

మనకు సహాయం చేసే, స్వస్థపరిచే శక్తి యేసుకు ఉందని మనం ఎలా నమ్మగలం?

యేసుకు సహాయం చేసే, స్వస్థపరిచే శక్తి ఉందని మన ఖచ్చితంగా తెలుసుకోవలసిన ఒక విషయం. అది నిజంగా చేస్తాడని నమ్మడం, విశ్వసించడం మరొక విషయం. మనకు ఏమి కావాలో యేసును అడగాలని, ఆయన మన ప్రార్థనలను విని, సమాధానమిస్తాడనే విశ్వాసం కలిగి ఉండాలని బైబిల్ మనకు బోధిస్తుంది. మత్తయి 7:7లో, "అడుగుతూ ఉండండి, అప్పుడు మీరు కోరినది మీకు లభిస్తుంది" అని యేసు చెప్పాడని మనం చదువుతాము. మరియు 1 పేతురు 2:24లో, యేసు "మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు."అని పేతురు మనకు చెప్పాడు.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

మీరు ప్రజలను యేసు దగ్గరకు ఎందుకు తీసుకురావాలి?

అంద్రెయ తన సోదరుడైన సీమోనును యేసు యొద్దకు తీసుకువచ్చాడు. వారిద్దరూ యేసును వెంబడించారు మరియు సీమోను ప్రారంభ చర్చిలో నాయకుడైన పేతురు (రాతి) అయ్యాడు. నలుగురు స్నేహితులు పక్షవాతంతో ఉన్న వ్యక్తిని యేసు వద్దకు తీసుకువచ్చారు మరియు అతని స్వస్థతను బట్టి ప్రజలు ఆశ్చర్యపడి, దేవునిని స్తుతించారు. యేసు అందరినీ తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. '“మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను' యేసు స్వస్థతను, క్షమాపణను మరియు నిత్యజీవాన్ని కూడా వాగ్ధానం చేశాడు. ఇతరులను యేసు దగ్గరికి తీసుకురావడంలో సహాయం చేయడానికి ఎంత మంచి కారణాలు ఉన్నాయి!

మీ పట్ల దేవుని ప్రేమను ప్రణాళికను కనుగొనండి

మీరు యేసునందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎందుకు కలిగి ఉండాలి?

దేవుని కుమారుడైన యేసు, సర్వశక్తిమంతుడు. మీరు భయపడకుండా, విశ్వాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యోహాను 14:1లో, "మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి" అని యేసు చెప్పాడు. అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న దావీదు రాజు "అయితే నేను భయపడినప్పుడు, నేను నీయందు నమ్మకం ఉంచుతాను. ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను ఎందుకు భయపడాలి?" అని రాసాడు. మీరు ఏమి ఎదుర్కొన్నప్పటికీ, యేసు ఎల్లప్పుడూ మీతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయనపై మీ నమ్మకాన్ని ఉంచండి మరియు ఆయన గాలిని, అలలను శాంతింపజేసినట్లుగా ఆయన శాంతి మిమ్మల్ని శాంతింపజేయనివ్వండి.

యేసు గురించి ఇతరులకు ఎందుకు చెప్పాలి?

యేసు చేసిన అద్భుతాలు, ఆయన సర్వశక్తిమంతుడని మరియు భౌతిక ప్రపంచంపైననూ ఆధ్యాత్మిక ప్రపంచంపైననూ ఆయనకు అధికారం ఉందని మనకు చూపుతాయి. దేవునిని మనకు చూపడానికి, మనము పాపులమని గ్రహించి, మన పాపమును ఒప్పుకొని, మన కొరకు యేసు సిలువపై చనిపోయాడని నమ్ముట ద్వారా దేవుని యొద్దకు, నిత్యజీవానికి తిరిగి వెళ్లే మార్గమును చూపుటకు యేసు భూమిపైకి వచ్చాడు. ఇది సువార్త లేదా శుభవార్త. యేసు ద్వారా అపవిత్రాత్మల నుండి విడుదల పొందిన వ్యక్తిలా, మీరు కూడా వెళ్లి మీ జీవితంలో “యేసు చేసిన గొప్ప కార్యాలను” ఇతరులకు చెప్పవచ్చు.

మీరు దేవుని వాక్యాన్ని ఎందుకు విశ్వసించాలి మరియు జీవించాలి?

యాకోబు 2:17లో, “విశ్వాసం మాత్రమే సరిపోదు. అది సత్క్రిక్రియలను కలిగించకపోతే అది మృతమైనదై, వ్యర్థమైపోతుంది. మీరు దేవుని వాక్యాన్ని వినడం మరియు విశ్వసించడం మాత్రమే కాదు, మీరు దేవుని వాక్యాన్ని జీవించాలి మరియు మీ అనుదిన జీవితంలో ఆత్మ ఫలాన్ని చూపించాలి. ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం మరియు మంచిపనులు చేయడం ద్వారా, మీరు "మీ మంచి పనులను అందరూ చూసేలా వెల్లడిపరుస్తారు, తద్వారా ప్రతి ఒక్కరూ మీ పరలోకపు తండ్రిని స్తుతిస్తారు. ".

Professor Quantum looking into camera
Professor Quantum’s Q&A

Superbook Kids Bible App

Image
Superbook Bible App Home Screen
  • Easy to understand Bible
  • Play more than 20 fun games
  • Watch full-length, free Superbook episodes

Discover more about the app and the impact of Superbook!

Icon
Superbook Kids Bible App

Download the Superbook Bible App!

Bring the Bible to life for the entire family with an easy to understand Bible, videos and fun engaging Bible games