Superbook App Icon
Superbook App
Open in the Superbook app
Skip to main content
అన్ని ఎపిసోడ్‌లు

పరీక్ష!

సూపర్‌బుక్ Episode 102
అల్టిమేట్ హోలోగ్రాఫిక్ గేమింగ్ సిస్టమ్ అయిన హోలో9ని అందుకున్నందున క్రిస్ ఉలిక్కిపడ్డాడు! కానీ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న బాలుడు అలాంటి సిస్టమ్ ను కలిగి ఉండాలనుకుంటున్నాడని విన్నప్పుడు క్రిస్ అపరాధ భావనను అనుభవిస్తాడు. అబ్రాహాము మరియు ఇస్సాకులను కలిసిన తర్వాత క్రిస్‌ తన మనసు మార్చుకోవడానికి సూపర్‌బుక్ సహాయపడతాడు. దేవునికి అబ్రహాము చూపిన విధేయత ద్వారా, అన్నింటికంటే ఎక్కువగా (ఒక హోలో9 కూడా) దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని, అప్పుడు మిగతావన్నీ పని చేస్తాయని క్రిస్ తెలుసుకుంటాడు,

సంబంధిత ప్రశ్నలు మరియు సమాధానాలు

దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడని అబ్రాహాము జీవితం ఎలా చూపించింది?

దేవుడు అబ్రాముకు (అబ్రాహాము) భూమిని, ఒక కొడుకును మరియు అనేకమంది వారసులను బహుమానంగా ఇస్తానని వాగ్ధానం చేశాడు. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూపించి అతన్ని ప్రోత్సహించాడు. నక్షత్రాల మాదిరిగానే, అబ్రాము సంతానం లెక్కించలేనంత ఎక్కువ అవుతుంది. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని కోరుకునే ప్రేమకలిగిన, దీవించే దేవుడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు మరియు భయపడవద్దని ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, మీరు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటారు.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

అబ్రాహాము, శారాలు బిడ్డను కనలేని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా బిడ్డను కనిన సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

దేవునికి అసాధ్యమైంది ఏది లేదు! దేవుడే సమస్తానికి సృష్టికర్త అని, ఆయనే సర్వశక్తిమంతుడని, ఆయనే మహిమ, ఘనత, ప్రభావాలు కలిగినవాడని, జయశీలుడని ప్రభావం గలవాడని గ్రహిస్తే, “ప్రభువుకు ఏదీ చాలా కష్టం కాదని, “ఆయనకు ఆసాధ్యమైంది ఏది లేదనడం”సబబు. ఏదీ కూడాఅసాధ్యం కాదు! నిజంగా ఏది అసాధ్యం కాదు!

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

దేవునితో అబ్రాహాముకు ఉన్న సంబంధము వలె మనము కూడా దేవునితో ఎలా సంబంధము కలిగి ఉండగలము?

దేవుడు అబ్రాముతో ప్రత్యేకమైన స్నేహాన్ని లేదా సంబంధాన్ని బహుమతిగా ఇచ్చాడు! అది నిజం: దేవునితో ఒక ప్రత్యేక స్నేహం! ఇది శాశ్వతంగా నిలిచిపోయే బహుమతి. ఆదాము, హవ్వలు పాపం చేయడం ద్వారా దేవునితో తమ సంబంధాన్ని పాడు చేసుకున్నారు. ఫలితంగా “అందరూ పాపం చేసారు; మనమందరం దేవుని మహిమాన్వితమైన ప్రమాణానికి చేరువ కాలేకపోతున్నాము”. మీరు మీ పాపాన్ని ఒప్పుకొని, యేసును రక్షకునిగా అంగీకరించినప్పుడు, తండ్రియైన దేవునితో మీ సంబంధం పునరుద్ధరించబడుతుంది. "పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం." మీరు దేవుని బిడ్డగా మారి, నిత్యజీవాన్ని పొందండి. దేవునితో మీ సంబంధం శాశ్వతం!

మీరు దేవునితో ఎలా సంబంధాన్ని కలిగి ఉండవచ్చో కనుగొనండి

మనకు ఏది అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉండాలనే విషయంలో అబ్రాహాము జీవితం మనకు ఏమి నేర్పిస్తుంది?

అన్నిటికంటే ముందు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని అబ్రాహాము నుండి మనం నేర్చుకోవచ్చు. అబ్రాహాము జాబితాలో దేవుడు అగ్రస్థానంలో ఉన్నాడు. అతను దేవునిపై విశ్వాసం కలిగి, దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాడు. అతను దేవునికి విధేయుడయ్యాడు మరియు అన్నింటికంటే, తన ఒక్కగానొక్క కుమారుని పట్ల తన ప్రేమ కంటే, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. 1 సమూయేలు 15:22లో: “బలి కంటే విధేయత మేలు” అని దేవుడు చెప్పాడు. “అన్నిటికంటే దేవుని రాజ్యాన్ని వెదకండి, నీతిగా జీవించండి, అప్పుడు నీకు కావలసినదంతా ఆయన ఇస్తాడు” అని యేసు చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, అన్నింటికంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వండి.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

ఇస్సాకు విషయంలో అబ్రాహాము అనుభవము, దేవుడు మనకు కావలసినన్ని ఇస్తాడని చూపిస్తుందా?

తప్పకుండా చూపిస్తుంది! కొన్నిసార్లు మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాం, అక్కడ మనం ఏమీ ఆలోచించలేము లేదా ఎవరైనా మనల్ని బయటకు తీసుకురావచ్చు. కానీ, దేవుడు ఒక సమకూర్చువాడు - మరియు మనం ఆయనకు విధేయత చూపినప్పుడు, ఆయనకు ఎల్లప్పుడూ ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు అబ్రాహాము బలి కోసం పొట్టేలును ఇచ్చాడు. ఇది అబ్రాహాము ఏకైక కుమారునికి ప్రతి ఇవ్వబడింది. దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు (దేవుని గొఱ్ఱెపిల్ల,=) సిలువపై మరణించడం ద్వారా పాపులకు ఎలా రక్షణను అందిస్తాడో మనకు తెలిపే ఒక “చిత్రం”. యేసు, దేవుడు మీకిచ్చిన పరిపూర్ణ బహుమతి. యోహాను 3:16 చదవండి. 'లోకం' మరియు 'అందరూ' అనే పదాల స్థానంలో మీ పేరు పెట్టుకోండి.

మీరు దేవుని పరిపూర్ణ బహుమతిని ఎలా అనుభవించవచ్చో కనుగొనండి
Professor Quantum looking into camera
Professor Quantum’s Q&A

Superbook Kids Bible App

Image
Superbook Bible App Home Screen
  • Easy to understand Bible
  • Play more than 20 fun games
  • Watch full-length, free Superbook episodes

Discover more about the app and the impact of Superbook!

Icon
Superbook Kids Bible App

Download the Superbook Bible App!

Bring the Bible to life for the entire family with an easy to understand Bible, videos and fun engaging Bible games