Superbook App Icon
Superbook App
Open in the Superbook app
Skip to main content
అన్ని ఎపిసోడ్‌లు

పది ఆజ్ఞలు

సూపర్‌బుక్ Episode 105
జాయ్ మరియు గిజ్మోతో పాటు క్వాంటం కుటుంబం కుటుంబ విహార యాత్రను ఆనందిస్తున్నప్పుడు, తన తల్లిదండ్రులు మరియు పార్క్ రేంజర్ నిర్దేశించిన నిబంధనలను విస్మరించడం మరింత సాహసోపేతమైన పని అని క్రిస్ రహస్యంగా నిర్ణయించుకున్నాడు. అతని నిర్లక్ష్య ధోరణి వలన సూపర్‌బుక్ మన శక్తివంతమైన త్రయాన్ని, గత సమయానికి విహారయాత్రకు పంపుతుంది, కాబట్టి నియమాలనేవి జీవితంలో సరదా లేకుండా చేయడానికి కాదు కానీ, మనల్ని రక్షించడానికే ఇవ్వబడినాయని నేర్చుకుంటారు!

సంబంధిత ప్రశ్నలు మరియు సమాధానాలు

ఎడారిలో ఉన్న ఇశ్రాయేలీయుల అవసరాలను దేవుడు తీర్చినట్లు మీ అవసరాలను కూడా తీరుస్తాడని మీరు ఎలా నమ్మగలరు?

దేవునికున్న పేర్లలో యెహోవా యీరే అనేది ఒకరి. ఈ మాటకు "దేవుడు సమకూరుస్తాడని" అర్థం. మీకు ఏది కావాలంటే అది దేవుడు ఇస్తాడని దీనర్థం కాదు (ఆయన దేవుడు - సీసాలో ఉండే జీనీ కాదు), కానీ మీకు అవసరమైన వాటిని ఆయన అందిస్తాడు. దేవుడు తనను ప్రేమించి, విధేయత చూపే వారి అవసరాలు తీరుస్తానని వాగ్దానం చేశాడు మరియు ఆయన తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేరుస్తాడు కాబట్టి మనం ఆయనను నమ్మగలము. ఫిలిప్పీ. 4:19లో, అపొస్తలుడైన పౌలు, “కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ నాకు తీర్చినట్లుగానే తీరుస్తాడు.” అని రాసాడు. ఫిర్యాదు చేయడానికి లేదా డిమాండ్ చేయడానికి బదులుగా, మీకు అవసరమైన వాటిని దేవుడు ఇస్తాడని ఆయన్ని నమ్మండి. ఆయన ఎల్లప్పుడూ నమ్మదగినవాడు.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

మీ జీవితంలో నిజంగా దేవుడు మొదటి స్థానంలో ఉండాల్సిన అవసరం ఉందా?

దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు (మరియు మనకు) సహాయం చేయడానికి మరియు రక్షించడానికి పది ఆజ్ఞలను ఇచ్చాడు. మొదటి ఆజ్ఞలు వ్యక్తిగతంగాను, సమాజంగాను దేవుడు తన ప్రజలతో కలిగి ఉండే సంబంధాన్ని గురించి మాట్లాడతాయి. అదే “దేవునికి మొదటి స్థానం ఇవ్వండి” అంటే అర్థం. దేవుడు మీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అతన్ని మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా చేసుకోండి. అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగినప్పుడు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను ప్రేమించవలెను” అని యేసు చెప్పాడు. ఇది దేవుని నియమాల, యేసు బోధల యొక్క ముఖ్యాంశం.

మీ పట్ల దేవుని ప్రేమను ప్రణాళికను కనుగొనండి

దేవుని నియమాలను పాటించడం ఎందుకంత ప్రాముఖ్యం?

పట్టాలపై ఉండే రైలు వేగంగా వెళ్లడానికి, దానిని రూపొందించిన పని చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉంటుంది. పట్టాలు లేనప్పుడు రైళ్లు ఎక్కడికీ వెళ్లలేవు. మనం జీవించడానికి దేవుని నియమాలు పట్టాల వంటివి. మనం వాటిని అనుసరిస్తే స్వేచ్ఛను, పరిపూర్ణతను అనుభవిస్తాము మరియు దేవుడు మనలను దేని కొరకు సృష్టించాడో దానికి తగినట్లుగా జీవిస్తాము. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి మరియు జీవించడానికి ఆయన నియమాలను అనుసరించండి.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

బంగారు దూడను తయారు చేసిన తర్వాత మోషేకు అహరోను ఎలా స్పందించాడనే దాని నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

అహరోను ప్రజలకు వారి బంగారు చెవిపోగులు ఇవ్వమని చెప్పినప్పటికీ, మోషేను ఎదుర్కొన్నప్పుడు అతను సాకులు మరియు అబద్ధం చెప్పాడు. అతను తన స్వంత చర్యలకు బాధ్యత వహింలేదు. ఇశ్రాయేలీయులు అసహనానికి గురై, దేవునికి అవిధేయులయ్యారు మరియు వారి పాపానికి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ, దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మన పాపపు చర్యలకు మనలను శిక్షించే బదులు, క్షమించబడటానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసాడు - యేసు సిలువపై మరణించినప్పుడు మన పాపానికి శిక్షను భరించాడు. మీరు మీ స్వంత చర్యలకు బాధ్యత వహించాలి మరియు మీ పాపాన్ని అంగీకరించాలి మరియు యేసు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని క్షమిస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు, కృపాకనికరం గల దేవుడు, కోపపడడానికి నిదానించువాడు మరియు ఎడతెగని ప్రేమ, నమ్మకత్వాలతో నిండి ఉన్నాడు. బైబిల్‌లో, వ్యక్తుల పొరపాట్లను గురించి చదవడం నుండి కూడా మీరు నేర్చుకోవచ్చు, తద్వారా మీరు భవిష్యత్తులో ఆ పొరపాట్లు చేయడానికి దూరంగా ఉండవచ్చు.

దేవునితో సమయం గడపడం (మోషే వలె) మన జీవితాలను ఎలా మార్చగలదు?

దేవునితో గడపడం మనల్ని మారుస్తుంది. మోషే విషయంలో అతని ముఖం ప్రకాశవంతంగా మారింది. దేవుని సన్నిధిలో ఉండడం, ప్రార్థించడం, ఆయనతో మాట్లాడడం, ఆయన వాక్యాన్ని చదవడం, ఆయన గురించి తెలుసుకోవడం వంటివి మన అంతరంగాన్ని మారుస్తాయి. మనం దేవుని ఆత్మతోనూ, ప్రేమతోనూ నిండి ఉన్నాం మరియు మనం ప్రతిదినం ఆయన కొరకు జీవించునట్లు, ఆయన మనకు శక్తిని, బలాన్ని మరియు జ్ఞానాన్ని ఇస్తాడు. "మరియు ఆత్మయైన ప్రభువు- మనం అతని మహిమ స్వరూపంలోనికి మారే క్రమంలో మనల్ని మరింతగా ఆయన సారూప్యతలోనికి మారుస్తాడు." మీరు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని అంతర్గతంగా మారుస్తాడు మరియు మీరు ఆయనలా, ఆయన స్వభావం కలిగిన వారివలె మారతారు.

Professor Quantum looking into camera
Professor Quantum’s Q&A

Superbook Kids Bible App

Image
Superbook Bible App Home Screen
  • Easy to understand Bible
  • Play more than 20 fun games
  • Watch full-length, free Superbook episodes

Discover more about the app and the impact of Superbook!

Icon
Superbook Kids Bible App

Download the Superbook Bible App!

Bring the Bible to life for the entire family with an easy to understand Bible, videos and fun engaging Bible games