Superbook App Icon
Superbook App
Open in the Superbook app
Skip to main content
అన్ని ఎపిసోడ్‌లు

గర్జన!

సూపర్‌బుక్ Episode 107
స్కేట్‌బోర్డ్ పార్క్ రౌడీయైన బారీ, చిన్నవాడైన టామీని వేధించినప్పుడు, "సరైన పని చేయడానికి"క్రిస్ నైతికంగా సవాలు చేయబడతాడు. సూపర్‌బుక్, పిల్లలను బబులోను దేశంలో దానియేలు మరియు రాజైన ధర్యావేషులను కలిసే సాహస యాత్రకు తీసుకువెళతాడు. ఈ సాహసం ద్వారా, క్రిస్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, సరైనదాని కోసం నిలబడినప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడని తెలుసుకుంటాడు.

సంబంధిత ప్రశ్నలు మరియు సమాధానాలు

సరైనది చేయడం ఎలాగో దానియేలు నుండి మనం ఎలా నేర్చుకోవచ్చు?

దానియేలు 1:8 లో 'దానియేలు తనను తాను అపవిత్రం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడని' మనం చదువుతాము. ఏది సరైనదని మనం నమ్ముతామో, దాని ఆధారంగానే మనం నిర్ణయాలు తీసుకుంటాము. అందుకే మనం ఏమి నమ్ముతున్నామో, ఎందుకు నమ్ముతున్నామో తెలుసుకోవడం ముఖ్యం. మరియు మీరు బైబిల్ చదవడం ద్వారా ఏమి నమ్మాలో తెలుసుకోగలరు. లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపించబడినవని, ఏది సత్యమో మనకు బోధించడానికి, మన జీవితాల్లో ఏది తప్పో తెలుసుకునేలా చేయడానికి ఉపయోగపడతాయని బైబిల్ చెబుతోంది. మనం తప్పు చేసినప్పుడు అది సరిదిద్దుతుంది, సరైనది చేయమని నేర్పుతుంది.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

దానియేలు దైవిక స్వభావాన్ని ఎలా చూపించాడు?

దానియేలు 6:4లో ఇతర అధికారులు దానియేలును విమర్శించడానికి ఎటువంటి కారణం కనుగొనలేకపోయారని మనం చదువుతాము. అతను నమ్మకంగా, నిజాయితీగా, ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ఉండేవాడు. దేవుడు మనిషి హృదయాన్ని చూస్తాడు (1 సమూయేలు 16:7) మరియు ఆ స్వభావమే పరిగణలోనికి తీసుకోబడుతుంది. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలుస్తాడు (1 పేతురు 2:13-16) మరియు మన జీవితాలలో ఆత్మ ఫలాన్ని (గలతీ 5:22-26) చూపించమని ఆజ్ఞాపించాడు. దానియేలు చూపించిన కొన్ని దైవిక విలువలు: (దానియేలు 6:4 - నమ్మకత్వం, బాధ్యత, విశ్వసనీయత; దానియేలు 6:10- స్థిరమైన ప్రార్థన, కృతజ్ఞత.)

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

మనం నిలబడి, మనం నమ్మిన దాని ప్రకారం నడుచుకోవాలని దానియేలు జీవితం మనకు ఎలా చూపిస్తుంది?

దానియేలు 6:10లో, 'శాసనంపై (రాజుకు తప్ప ఎవరికీ ప్రార్థించకూడదని) సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకున్నప్పుడు, అతను ఇంటికి వెళ్లి, యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఉన్న తన మేడమీద గదిలో యధావిధిగా మోకరించి ప్రార్థించాడు. అది అద్భుతం కాదా? దానియేలు దేవుణ్ణి ఎంతగా విశ్వసించాడంటే, కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు కోరినట్లే చేశాడు! మన చర్యలు మనల్ని గురించి మాట్లాడతాయి. మనం కూడా దేవుణ్ణి విశ్వసించాలి మరియు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం నమ్మిన దాని కోసం నిలబడాలి. అలాగే, ఇలాంటి కష్ట సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

మనం ప్రార్థన చేయడానికి దానియేలు యొక్క మాదిరికరమైన జీవితం మంచి మార్గంగా ఉందా?

అవును, మాదిరిగానే ఉంది. దానియేలు 6:10లో దానియేలు 'ఎల్లప్పుడూ చేసినట్లుగానే ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు.' అని చదువుతాము. ఇప్పుడు రోజుకు 3 సార్లు అనేది ఒక రకమైన మ్యాజిక్ నంబర్ కాదు, కానీ దానియేలు‌కు ప్రార్థన (దేవునితో మాట్లాడే సమయం) చాలా ముఖ్యమైనదని స్పష్టంగా తెలుస్తుంది. దేవునితో సంభాషించడం, అతని జీవితంలో విలువకలిగిన అంశం. ఇది కూడా ఒక క్రమశిక్షణ - అతను ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు. క్రైస్తవుడిగా ఎదగడానికి, మనం ప్రార్థన చేయాలి, అలాగే బైబిల్ చదవడం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడం రోజువారీ క్రమశిక్షణగా ఉండాలి. దానియేలు దేవునితో తన సంబంధాన్ని దృఢంగా ఉంచుకున్నాడు కాబట్టి, అతను ఆపదలో చిక్కుకున్నప్పుడు తన మనవిని త్వరగా దేవునికి తెలియజేశాడు.

మీ పట్ల దేవుని ప్రేమను, ప్రణాళికను కనుగొనండి

యదార్థత కలిగిన దానియేలు జీవితం ఇతరులను ఎలా ప్రభావితం చేసింది?

దానియేలు, యథార్థత కలిగిన వ్యక్తి. అతనిలో ఉన్న ఈ లక్షణం, ప్రజలనూ దేశాలను ప్రభావితం చేసింది. దానియేలు 6:25-26లో, దర్యావేషు రాజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి జాతి, ప్రతి దేశం మరియు ప్రతి భాష మాట్లాడు ప్రజలకు ఒక సందేశాన్ని పంపాడు, దానియేలు ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడని, ఆయన రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందని, ఆయనే అద్భుతాలు చేసే దేవుడు కనుక ఆయన్ని గౌరవించాలని, ఆయనకు భయపడాలని చెప్పాడు, దానియేలు యదార్థత, అలల వంటి ప్రభావాన్ని కలిగి ఉంది. అదే విధంగా, మన యదార్థత మన చుట్టూ ఉన్న ప్రజలను కూడా ప్రభావితం చేయగలదు మరియు దేవునిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు యదార్థతతో జీవించగలుగుతారు.

Professor Quantum looking into camera
Professor Quantum’s Q&A

Superbook Kids Bible App

Image
Superbook Bible App Home Screen
  • Easy to understand Bible
  • Play more than 20 fun games
  • Watch full-length, free Superbook episodes

Discover more about the app and the impact of Superbook!

Icon
Superbook Kids Bible App

Download the Superbook Bible App!

Bring the Bible to life for the entire family with an easy to understand Bible, videos and fun engaging Bible games